ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్సీ కాల్ డేటా లీక్.. ఇద్దరు పోలీసులు సస్పెన్షన్​

ఎమ్మెల్సీ కాల్ డేటా వ్యవహారంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్​పై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్సీ కాల్ డేటా బయటకు వెళ్లటంపై.. విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

Police suspended
పోలీసులు సస్పండ్

By

Published : Jul 19, 2021, 1:28 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ కాల్ డేటా వ్యవహారంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్​పై ఎస్పీ అన్బురాజన్ చర్యలు తీసుకున్నారు. గత నెలలో తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొద్దుటూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా కాల్ డేటా కీలకం కావడంతో వివరాలు సేకరించేందుకు.. ఎమ్మెల్సీ వద్ద పోలీసులు అనుమతి తీసుకున్నారు. అయితే పోలీసులు సేకరించిన కాల్ డేటా సమాచారం బయటికి పొక్కింది. ఈ సమాచారం ఎలా బహిర్గతం అయిందన్న విషయంపై ఎస్పీ విచారణకు ఆదేశించడంతో ఇద్దరు పోలీసుల పాత్ర ఉన్నట్లు బయటపడింది.

వేటు పడింది..

ప్రొద్దుటూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డితో పాటు మరో కానిస్టేబుల్ శ్రీనివాసులరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సస్పెన్షన్ ప్రతులను కూడా అందజేసినట్లు సీఐ ఆనందరావు తెలిపారు.

ఇదీ చదవండీ..పశ్చిమగోదావరి జిల్లా గొల్లలకోడేరులో వృద్ధ దంపతుల ఘర్షణ..భర్త మృతి

ABOUT THE AUTHOR

...view details