ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 13, 2022, 8:37 AM IST

ETV Bharat / state

మట్టి వాసనపై మమకారం పోక.. మైదుకూరు ఇంజినీర్‌ సాఫ్ట్‌గా ‘సాగు’

Software in his agriculture field: ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నా.. ఆ అన్నదాత కుమారుడికి మట్టి వాసనపై మమకారం పోలేదు. కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తూనే సొంతంగా ఎకరం పొలంలో వివిధ రకాల పంటలు వేసి మంచి లాభాలు గడిస్తున్నాడు.

Software success in his agriculture field at kadapa
సాఫ్ట్‌గా ‘సాగు’తున్న మైదుకూరు ఇంజినీర్‌

Software in his agriculture field: కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన శ్రియపురెడ్డి శివానందరెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రముఖ కంపెనీలో పని చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నా..వ్యవసాయంపై మక్కువ తగ్గలేదు. కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తూనే సొంతంగా ఎకరం పొలంలో గతేడాది కదిరి-1812 రకం వేరుసెనగ సాగు చేసి మంచి లాభాలు గడించారు. ఈ సారి చిరుధాన్యాల పంట సజ్జ సాగు చేయాలని హరియాణా నుంచి ‘దేశి’ రకం విత్తనాలు సేకరించి ఎకరం పొలంలో సాగుచేశారు.

ఒక్కో మొక్కకు నాలుగైదు పిలకలుండగా అవన్నీ కంకి తొడిగాయి. సాధారణంగా కంకి అడుగు.. అడుగున్నర వరకు ఉంటుంది. శివానందరెడ్డి సాగుచేసిన పొలంలో మూడు నుంచి అయిదడుగుల వరకు పొడవున్నాయి. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ఈ సాఫ్ట్‌వేర్‌ రైతు పొలంలో 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details