" ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించాల్సిందే" - latest school regulation commission news in kadapa
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని పాఠశాల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు నారాయణరెడ్డి హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయకపోతే చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా కడప జిల్లాకు వచ్చారు. జిల్లా విద్యాధికారులతో సమావేశమై జిల్లాలోని విద్యాశాఖ పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం నియమించిన రెగ్యులేషన్ కమిషన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి పాఠశాల విద్య రూపురేఖలు మార్చడానికి ప్రయత్నిస్తుందని అన్నారు . చాలా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ లేదని.... కమిషన్ నియమించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ఆయన తెలియజేశారు. పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారని... నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకునే అధికారం రెగ్యులేషన్ కమిషన్ కు ఉందన్నారు