ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరులో ఆర్టీసీ కార్మికుల ఆందోళన - మైదుకూరులో ఆర్టీసీ కార్మికుల ధర్నా వార్తలు

కార్మికుల పట్ల పక్షపాత వైఖరి వీడాలని కడప జిల్లా మైదుకూరులో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఇంధన పొదుపు పేరుతో కార్మికులను వేధించవద్దని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

By

Published : Nov 10, 2019, 6:23 PM IST

మైదుకూరులో ఆర్టీసీ కార్మికుల ధర్నా

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు ఇతర విధులు అప్పగించొద్దని... ఇంధన పొదుపు పేరుతో వేధించవద్దని కోరారు. యూనియన్ నాయకుల ద్వారా సెలవులు ప్రతిపాదించే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని... 9 ఏళ్లకు, 18 ఏళ్లకు చెల్లించాల్సిన ఇంక్రిమెంట్లు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details