ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధ్వానంగా తాళ్లపాక రహదారి... పట్టించుకోని అధికారులు

కడప జిల్లాలో మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ వేసిన రహదారి ప్రస్తుతం దారుణంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. కనీసం నడిచేందుకు కూడా వీలు లేక అధ్వానంగా తయారైంది. తమ సమస్యను అధికారులకు విన్నవించుకున్నా తాత్కాలిక పనులతో కాలం వెళ్లదీస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

road damaged with rains in thallapaka kadapa district
గుంతలతో, కోతలతో అధ్వాన్నంగా తాళ్లపాక రహదారి

By

Published : Dec 13, 2020, 4:48 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరులోని అగస్తేశ్వర స్వామి ఆలయం, తాళ్లపాకలోని శివకేశవుల ఆలయం, హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయం వరకు ఎనిమిదేళ్ల క్రితం రూ.4 కోట్ల వ్యయంతో పర్యటక శాఖ ఆధ్వర్యంలో రహదారి నిర్మించారు. తాళ్లపాక నుంచి హత్యరాలకు వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టుకు ఇరువైపులా రహదారి కోతకు గురైంది. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. రోడ్డు, భవనాల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన ఈ మార్గాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details