ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్​కలెక్టర్ - కడప జిల్లా తాజా వార్తలు

కడప జిల్లా బద్వేలు మండలంలో నామినేషన్ల ప్రక్రియను రాజంపేట సబ్​కలెక్టర్ కేతన్ గార్గి పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అనంతరాజపురం గ్రామస్తులకు సూచించారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న సబ్​కలెక్టర్
గ్రామస్థులతో మాట్లాడుతున్న సబ్​కలెక్టర్

By

Published : Jan 31, 2021, 12:29 PM IST

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గి కోరారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం గ్రామంలో నామినేషన్ల స్వీకరణ ఘట్టాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. నామినేషన్ల సమస్యపై గ్రామస్తులు ఆయనతో చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా మంచి పాలన అందించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డీఎస్పీ విజయ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details