ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనం కనిపిస్తే వదలడు.. ఈ పాత్రల వ్యాపారి...! - two wheelers thier arrests by maidukur police

అతనో సిల్వర్ పాత్రల వ్యాపారి... ఊరూరా తిరిగి పాత్రలు అమ్మటంతో పాటూ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసేవాడు. కడప, కర్నూలు జిల్లాల్లో దాదాపు 22 టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాలను చోరీ చేసిన ఈ ఘరానా దొంగను మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులకు చిక్కిన ద్విచక్రవాహన దొంగ

By

Published : Oct 30, 2019, 1:45 PM IST

పోలీసులకు చిక్కిన ద్విచక్రవాహన దొంగ
ఊరూరా తిరిగి పాత్రల వ్యాపారం చేస్తూ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుణ్ని కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఫకృద్దీన్​ ఊరూరా తిరిగి పాత్రలు అమ్ముతూ గ్రామాల్లో టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాలను దొంగలించేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 22 టీవీఎస్​ ఎక్సెల్​ వాహనాలు తస్కరించాడు. వరుస ఫిర్యాదులతో విచారించిన పోలీసులు.. నిఘా ఉంచి నిందితుడి ఆట కట్టించారు. అపహరించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని మైదుకూరు సీఐ మదుసూదన్​ తెలిపారు. అప్పుల బాధ తట్టుకోలేకే ఫకృద్దీన్​ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details