కడప జిల్లా అట్లూరు వ్యవసాయ పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో అన్వేషకుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్దలు, పిల్లలు పెద్దఎత్తున తరలివచ్చి వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయ పొలాల్లో తెల్లటి రంగు రాళ్లు బయటపడుతున్నాయి.
వీటినే వజ్రాలుగా భావించి ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పొలాల్లో వేట సాగిస్తున్నారు. ఇందుకు తోడు... కొందరికి ఇక్కడి వ్యవసాయ పొలాల్లో వజ్రాలు దొరికినట్లు పుకార్లు రావడంతో రద్దీ క్రమంగా పెరుగుతోంది.