ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 5:09 PM IST

ETV Bharat / state

కడపలో ఆపరేషన్ ముస్కాన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

operation muskaan in cadapa
కడపలో ఆపరేషన్ ముస్కాన్

కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ఎస్పీ అన్బురాజన్ జెండా ఊపి ప్రారంభించారు. వారం రోజుల పాటు ప్రత్యేక బృందాలు నగరం మొత్తం తిరుగుతాయని చెప్పారు.

బాలకార్మికులకు విముక్తి కల్పిస్తామన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో పనులు చేస్తున్న మైనర్లందరినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కరోనా సమయంలో పిల్లలను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో.. సీఎం, డీజీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details