ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2019, 11:44 PM IST

ETV Bharat / state

'కడపలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ'

ప్రభుత్వ భూమిని పరిరక్షించటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. కడపజిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్​లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్నారు.

సీపీఎం రాఘవులు

కడపజిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్​లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని రక్షించడంలో గత ప్రభుత్వంతోపాటు నేడు అధికారంలో ఉన్న వైకాపా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆక్రమణ దారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై... ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పగించినట్లు తెలుస్తోందన్నారు. వ్యవసాయంతో సంబంధం లేని వారికి రెవెన్యూ అధికారులు పట్టాలు అందించారని ఆరోపించారు. కాశినాయన మండలంలో పేదలకు ఇచ్చిన భూములను లాక్కుని వేరొకరికి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. భూ కుంభకోణంపై గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడు విచారణ జరిపించారని... ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కడపజిల్లాలో భారీగా జరిగిన భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు.

సీపీఎం రాఘవులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details