ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2020, 9:00 AM IST

Updated : Dec 11, 2020, 9:13 AM IST

ETV Bharat / state

'25న ఇంటి స్థలాల పంపిణీతోపాటు.. పక్కా గృహాల నిర్మాణానికి శంకుస్థాపన'

మైదుకూరు నియోజకవర్గంలో 25 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని, పెట్టుబడి రూపంలో రూ. 75 కోట్ల నష్టం జరిగిందని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబరు ఆఖరునాటికి నష్టపరిహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కడపలో ఆయన స్పష్టం చేశారు.

MLA Raghuram Reddy
ఎమ్మెల్యే రఘురాం రెడ్డి

ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న కారణంగా రెండో పంటకు తెలుగు గంగ, కేసీ కాల్వల కింద మార్చి 15 వరకు సాగు నీరు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే అధికారులతో చర్చించామని, వారం రోజుల్లో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న కారణంగా రెండో పంటకు నీరివ్వడం ద్వారా రైతులకు ఉపశమనం కలుగుతుందన్నారు. డిసెంబరు ఆఖరునాటికి నష్టపరిహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిపారు. జనవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసేందుకు నియోజక వర్గానికి 48 మినీ ట్రక్కులు మంజూరైనట్లు తెలియజేశారు. డిసెంబర్ 25న ఇంటి స్థలాల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించిన ఆయన వీటితోపాటు పక్కా గృహాలు నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

Last Updated : Dec 11, 2020, 9:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details