కడప వాణిజ్య పన్నులశాఖ డిప్యూటి కమిషనర్ లూర్దయ్యనాయుుడు అక్రమాస్తులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకు లాకర్‌ను తెరిచిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు... 31 లక్షల 45 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు దొరికాయి. కొన్ని రోజుల క్రితమే ఆయన ఇంట్లో సోదాలు జరిపిన అనిశా అధికారులు... ఆదాయానికి మించిన కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటికే 10 కోట్ల విలువైన ఆస్తులను అనిశా గుర్తించింది. లూర్దయ్యనాయుడు రిమాండ్‌లో ఉండగా.. ఆయన భార్య సమక్షంలో అనిశా అధికారులు లాకర్ తెరిచారు.
తవ్వేకొద్దీ బయటపడుతున్న కోట్ల అక్రమాస్తులు
ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులను వెనకేసుకున్న అవినీతి అనకొండ పుట్టను తొలిచే కొద్దీ కోట్ల రూపాయలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే అనిశాకు చిక్కిన లూర్దయ్యనాయుడుకి చెందిన ఓ లాకర్‌ను ఇవాళ అధికారులు తెరవగా 31 లక్షల 45 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు బయటపడ్డాయి.
బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్న అనిశా