ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ కె.కృష్ణ తెలిపారు. కౌంటింగ్ రోజున ఎవరైన ఘర్షణలకు పాల్పడినా.. గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం ఆవరణలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమై.. 23న జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం నిషేధమని తెలిపారు.
ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు నిషేధం
ఓట్ల లెక్కింపు రోజున జమ్మలమడుగులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రతిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని డీఎస్పీ కె.కృష్ణ తెలిపారు. లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.
జమ్మలమడుగు డీఎస్పీ కె.కృష్ణ