కడప జిల్లాలో కుందు వరద ప్రవాహం పోటెత్తటంతో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి,ముంపు ప్రాంతాలను పరిశీలించారు.వ్యవసాయ శాఖ,ఉద్యాన శాఖ అధికారులతో కలసి ఏటూరు,సన్నపల్లె,చిన్న గులువలూరు,పెద్ద గులువలూరు,శ్రీరాముల పేట,అల్లాడుపల్లె ప్రాంతాల్లో పర్యటించారు.మునిగిన వరి,పసుపు పంటలను పరిశీలించి,పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.
కుందు నది ముంపు పంటలకు పరిహారం:ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - పరిహారం
కుందు వరదతో నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిశీలించారు. రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

'నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తాం'