ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2019, 6:49 AM IST

ETV Bharat / state

గాంధీ గృహం... కడపలో ఎక్కడుందో తెలుసా..?

మహాత్మా గాంధీ... ఈ పేరు వింటే దేశంలోని ప్రతీఒక్కరు... నా అనుకునే మహానుభావుడు. అలాంటిది బాపూజీ 3 రోజులు మన ఇంట్లో ఇంటే... అది చరిత్రకు సాక్ష్యంగా నిలిస్తే... ఆ ఆనందమే వేరు కదా. అలాంటి ఆనందమే అనుభవిస్తున్నారు కడప పట్టణానికి చెందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు.

gandhiji-house-located-in-kadapa-district

గాంధీ గృహం... కడపలో ఎక్కడుందో తెలుసా..?
బాపూజీకి కడప పట్టణంతో 3రోజుల ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన కడపకు వచ్చినప్పుడు... ఓ ఇంట్లో 3 రోజులపాటు బస చేశారు. బాపూజీ అడుగుపెట్టిన ఆ ఇంటిని... కడప గాంధీ గృహంగా నామకరణం చేశారు. ఇప్పటికీ ఆ ఇల్లు చెక్కు చెదరలేదు. అప్పట్లో మహాత్ముడిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చినట్లు స్వాతంత్య్ర సమరయోధులు చెబుతున్నారు.

మీరు చూస్తున్న ఈ ఇంటికి ఓ అపురూపమైన చరిత్ర ఉంది. జాతికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహాత్మాగాంధీ... దేశ పర్యటనలో భాగంగా కడపకు వచ్చారు. 1933 సంవత్సరంలో 3 రోజులపాటు ఈ ఇంట్లోనే బస చేశారు. గాంధీ తమ పట్టణానికి వచ్చాడని తెలుసుకున్న ప్రజలు... చూసేందుకు భారీగా తరలివచ్చారు. 1929లో అప్పటి స్వాతంత్య్ర సమరయోధుడు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఈ ఇల్లును కడప ఏడురోడ్ల కూడలి వద్ద నిర్మించారు.

ఆ పర్యటనలో గాంధీజీ... కడపలోని హరిజన వాడను సందర్శించారు. విరాళాలు కూడా సేకరించారని అప్పటి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 3రోజుల పాటు కడపలో ఉండి... ఇక్కడి రైల్వేస్టేషన్ వెళ్లి... రేణిగుంట వెళ్లినట్లు చెబుతున్నారు. గాంధీ కడపకు వచ్చినప్పుడు... తన చిత్రపటంపై స్వయాన సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని ఇప్పటికీ సదరు ఇంటి యజమానులు భద్రంగా దాచిపెట్టారు. ఇంటికి కడప గాంధీ అని పేరు రావడం సంతోషంగా ఉందని దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి తనయుడు హరికిషోర్ రెడ్డి సంబరపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details