ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందుల ప్రాజెక్టులకు త్వరితగతిన నిధులు : సీఎం - పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో గతంలో చేసిన శంకుస్ధాపనలు, పనుల పురోగతి, బడ్జెట్‌ కేటాయింపులపై సమీక్షించిన సీఎం త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

cm jagan review on pulivendula developmen
సీఎం జగన్

By

Published : Aug 1, 2020, 9:16 AM IST

కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీపై సీఎం సమీక్షించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్​రెడ్డి, పడా స్పెషల్‌ ఆఫీసర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఎర్రబల్లి, గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో పార్నపల్లి, పైడిపాలెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్ట్‌కు పరిపాలన ఆమోదం తెలిపారు. జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్కీమ్, అలవలపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ పనుల పురోగతిపై చర్చించారు. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ల పురోగతిపై చర్చించారు.

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుచేయడం కోసం 261.90 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులపై చర్చించారు. 154 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, మొగమేరు వంకపై ఫ్లడ్‌బ్యాంక్స్‌ , చెక్‌డ్యామ్‌ల ఆమోదంపైనా సమగ్రంగా చర్చించారు. పులివెందులలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం, వేంపల్లి యుజీడీ, సింహాద్రిపురం డ్రైనేజ్‌ సిస్టమ్, ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్ట్‌ రోడ్‌ పనులు, పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రపోజల్స్, న్యూ బస్‌ స్టేషన్, మినీ సెక్రటేరియట్, పులివెందుల మెడికల్‌ కాలేజి ఏర్పాటు, వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజి, వేంపల్లి ఉర్దూ జూనియర్‌ కాలేజి, నాడు నేడు స్కూల్స్‌ పనుల పురోగతిపై చర్చించిన ముఖ్యమంత్రి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఏపీ కార్ల్‌ భూముల వినియోగంపై చర్చించారు. పులివెందుల క్రికెట్‌ స్టేడియం, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.

ABOUT THE AUTHOR

...view details