కడపలో ఎక్కువ ధ్వని కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏకంగా.. 150 వాహనాలను కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనల ప్రకారం బుల్లెట్ వాహనాలకు వస్తున్న సైలెన్సర్ తొలగించి.. వాటి స్థానంలో ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకొని నగరంలో తిరుగుతున్న వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులతో డీఎస్పీ సునీల్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. తీరు మార్చుకోకుంటే.. మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సైలెన్సర్లు మార్చుకోవాలని ఆదేశించారు.
శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలు సీజ్ - కడప జిల్లాలో బుల్లెట్ వాహనాలు తాజా వార్తలుట
కడపలో శబ్ధ కాలుష్యం సృష్టిస్తున్న పలు బుల్లెట్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ సునీల్ ఆదేశాలు మేరకు 150 వాహనాలను స్టేషన్కు తరలించారు. వాహనదారులు తీరు మార్చుకోకపోతే కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.

శబ్ధకాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలు సీజ్
TAGGED:
Vahananalu seeze