ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయసు చిన్నది... ఆలోచన పెద్దది..! - క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు

చిన్న త‌నంలోనే పెద్ద మ‌న‌సు చేసుకొని ఏకంగా... రూ.ల‌క్ష విరాళంగా ఇచ్చాడు ఓ బాలుడు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠ‌శాల‌లో మూడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి ద‌ర్శ‌న్... మైల‌వ‌రం మండలంలోని డాడీహోం సంస్థకు విరాళం ఇచ్చారు.

రూ.ల‌క్ష విరాళంగా ఇచ్చిన బాలుడు

By

Published : Nov 10, 2019, 6:33 AM IST

రూ.ల‌క్ష విరాళంగా ఇచ్చిన బాలుడు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిన్నారి దర్శన్... మైలవరం మండలంలోని డాడీహోం సంస్థకు రూ.లక్ష విరాళం ఇచ్చాడు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు డాడీహోం సంస్థ ఆసరాగా నిలుస్తోంది. ఇక్కడ ఉన్న పిల్లలు ఈ నెల 16, 17 తేదీల్లో జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకు అవసరమయ్యే నగదును దర్శన్... తల్లిదండ్రులు, బంధువుల ద్వారా సేకరించి పౌండేషన్‌ ఛైర్మన్‌కి అందజేశారు. చిన్నారి దర్శన్‌ను బంధువులు, స్థానికులతో సహా పలువురు అభినందించారు. తమ కుమారుడికి చిన్నతనంలోనే సేవచేసే ఆలోచన రావటం తమకు ఆనందంగా ఉందంటూ... బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details