కడప ఆర్అండ్బి అతిథి గృహంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నాయకులు కలిశారు(bjp leaders meet election observer bhishma kumar). బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతోపాటు తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని వైకాపా నాయకులు, మంత్రులపై ఫిర్యాదు చేశారు(bjp leaders over ycp).
బద్వేలు నియోజకవర్గంలో వెంటనే కేంద్ర పారామిలటరీ బలగాలను రప్పించాలని కోరారు. పోలింగ్ బూతులో తమ పార్టీ ఏజెంట్లు కూర్చోకుండా ఇప్పటి నుంచే స్థానిక పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు. ప్రచారంలో వాలంటీర్లను కూడా వినియోగిస్తున్నారని విన్నవించారు.
అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారని.. ఆధారాలను ఎన్నికల పరిశీలకలకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్.. బద్వేలు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజుతోపాటు ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవ్ దర్, సత్యకుమార్, మాజీమంత్రి ఆదినారాణరెడ్డి.. ఎన్నికల పరిశీలకులను కలిశారు.