ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీవారి ఆస్తుల విక్రయాలు, లీజు జీవోను రద్దు చేయాలి'

హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి జగన్ లో మార్పు రావడం లేదని భాజపా నేతలు ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయాలు, లీజు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

bjp
bjp

By

Published : May 26, 2020, 2:19 PM IST

సీఎం జగన్ ఏడాది పాలనలో 69 సార్లు హైకోర్టు అక్షింతలు వేసినా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల విక్రయాలు, లీజు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కడపలో ఆయన ఉపవాస దీక్ష ప్రారంభించారు.

ప్లకార్డులతో నిరసన తెలిపారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్తే.. ఏం జరుగుతుందో గతంలోని పాలకులందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అదే పని చేస్తున్నారని ఆగ్రహించారు. తక్షణం జీవోలను రద్దు చేసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details