పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని.. రహదారిపై ఉన్న గోతుల్లో ధర్నా నిర్వహించారు. కొన్నేళ్లుగా జాతీయ రహదారిపై గోతులతో నరకాన్ని చూస్తున్నామని ప్రజలు తెలిపారు. నీటిలో మోకాళ్లతో ప్రదర్శన నిర్వహించారు. అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప రహదారి నిర్మాణం చేపట్టడం లేదన్నారు.
రహదారి నిర్మాణం చేపట్టాలని మోకాళ్లపై గ్రామస్థుల నిరసన - news on koyyalagudem
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో రహదారి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు మోకాళ్లపై నిరసన చేపట్టారు.రహదారిపై గోతులతో నరకాన్ని చూస్తున్నామని వాపోయారు.

రహదారి నిర్మాణం చేయాలని మోకాళ్లపై గ్రామస్థుల నిరసన
ప్రభుత్వాలు మారుతున్నా రహదారి నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ప్రతీ ఏడాది రహదారి ప్రమాదంలో అనేక మంది మృతి చెందుతున్నారని, మరి కొందరు శాశ్వత వికలాంగులుగా మారారని విచారం వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇస్తే గాని ఆందోళన విరమించమని ఆందోళనకారులు స్పష్టం చేశారు. కొయ్యలగూడెం ఎస్సై ఆందోళన చేపట్టిన వారితో చర్చలు జరిపారు.
ఇదీ చదవండి: 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'