11టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - pds rice
పెరవలి జాతీయ రహదారిపై సుమారు 18లక్షల రూపాయలు విలువ చేసే 11టన్నుల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

రేషన్ బియ్యం
పశ్చిమగోదావరి జిల్లా పెరవలి జాతీయరహదారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 11 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 18లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు నుంచి వేడంగి గ్రామంలోని బియ్యం మిల్లుకు తరలిస్తున్నారన్న... సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. బియ్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకుని... వ్యాపారి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
రేషన్ బియ్యం