కరోనా విపత్తు సమయంలో సేవా సంస్థలు, దాతలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. పేదవాడి ఆకలి గుర్తించి అన్నం పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 రోజుల నుంచి పేదలకు ఆహారాన్ని పంచిపెడుతున్నారు. విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం అధినేత ఉమర్ ఆలిషా స్ఫూర్తితో ప్రతి రోజు 120 నుంచి 150 మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ నందం తాతయ్య తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - ఉమర్ ఆలీషా ట్రస్ట్ ఆహారం సరఫరా
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఆహారం పంచిపెట్టారు. నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పేదలకు ఆహారం అందించిన ఉమర్ ఆలీషా ట్రస్ట్