ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మమ్మల్ని ఇంకెన్ని రోజులకు పంపిస్తారు?'

పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వలస కార్మికులు పనులు లేకపోయినా 45 రోజులుగా అక్కడే మగ్గిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వస్థలాలకు పంపించాలని ఆందోళన చేశారు.

polavaram workers
polavaram workers

By

Published : May 9, 2020, 6:55 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్ట్ లో పనిచేసే కార్మికులు తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు. 200 మంది వలస కార్మికులు పోలవరంలో కడెమ్మ వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 45 రోజులుగా పనులు లేక ప్రాజెక్ట్ ప్రాంతంలో మగ్గిపోతున్నామని కార్మికులు తమ గోడు చెప్పుకున్నారు.

తమను సొంత రాష్ట్రాలకు పంపకుండా ఇక్కడే ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం అందరినీ కొవ్వూరు రైల్వే స్టేషన్ కు చేర్చి అక్కడ నుంచి ప్రత్యేక రైళ్లలో పంపుతామని రెవెన్యూ, పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా.. వెంటనే తరలించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఇవీ చదవండి:

నిర్లక్ష్యమా.. యంత్రాంగ వైఫల్యమా.. వి'శోక' విపత్తుకు కారణాలేంటి..?

ABOUT THE AUTHOR

...view details