పోలవరం ప్రాజెక్టు వద్ద రెండో రోజూ పనుల్ని మరింత ముమ్మరం చేశారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం పనులు ప్రారంభించిన మేఘా సంస్థ స్పిల్వే వద్ద కాంక్రీటు నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గోదావరి వరదల కారణంగా స్పిల్వే ప్రాంతమంతా దెబ్బతినటంతో పాటు పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఈ మేరకు ముందు నీటిని తొలగించి, కాంక్రీటు వాహనాల రాకపోకలకు వీలుగా రహదారుల్ని సిద్ధం చేస్తున్నారు. స్పిల్వే పనుల తర్వాత కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని దశలవారీగా చేపట్టనున్నారు.
పోలవరం పనులు ముమ్మరం... 2021కి ప్రాజెక్టు పూర్తే లక్ష్యం - పోలవరం ప్రాజెక్టు వార్తలు
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవటమే లక్ష్యంగా మేఘా సంస్థ స్పిల్వే పనులను ప్రారంభించింది.

పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభంచిన మేఘా సంస్థ
ముమ్మరంగా సాగుతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు
ఇదీ చూడండి :