నరసాపురం లోని పలు వార్డుల్లోని వీధులు జలమయం
ప్రభుత్వాలు ఎన్ని మారినా..పాలకులు ఎన్ని హామీలిచ్చిన తమ ప్రాంతలోని పరిస్థితి ఏ మాత్రం మారలేదని ప.గో జిల్లా నరసాపురం వాసులు అంటున్నారు. పట్టణలోని పలు వార్డుల్లోని వీధులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని...అధికారులు స్పందించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో పట్టణంలోని 2,3, 9 వార్డుల పరిధిలోని పొన్నపల్లి నందమూరి కాలనీ లోని పలు వీధులు జలమయమయ్యాయి. నివాసాల్లోకి వరద నీరు చేరి... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక అధికారులు మోటార్ ఏర్పాటుచేసి వరద నీటిని గోదావరిలోకి తోడుతున్నారు. వీధుల్లో నీరు చేరి... దోమల బెడద, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు వాపొయ్యారు. పాలకులు స్పందించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి...శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.