ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పేరుతో వేధించి... బలవంతంగా పెళ్లి చేసుకుని..!

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించి... బలవంతంగా పెళ్లి చేసుకుని అపహరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Man arrested for abducting and molesting a minor girl in West Godavari district
పశ్చిమగోదావరిలో మైనర్ బాలికను వేధించి పెళ్లి చేసుకున్న యువకుడు

By

Published : Dec 17, 2019, 7:14 PM IST

బాలికను పెళ్లి చేసుకుని అపహరించిన వ్యక్తి అరెస్టు

ఇంటర్మీడియట్ బాలికను ప్రేమ పేరుతో వేధించి.. బలవంతంగా పెళ్లి చేసుకొని... అపహరించిన వ్యక్తిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెదవేగి మండలం కే. కన్నాపురం గ్రామానికి చెందిన అనంత్ కుమార్ ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె చదువుతున్న కళాశాలకు వెళ్లి ప్రేమ,పెళ్లి పేరుతో వేధించేవాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తాళికట్టి.. అపహరించాడు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details