ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసాపురంలో స్వర్ణకారులకు అండగా నిలిచిన బంగారు వర్తక సంఘం

లాక్​డౌన్​తో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో స్వర్ణకారులకు చేయూతనిచ్చేందుకు బంగారు వర్తక సంఘం ముందుకొచ్చింది. వారికి నిత్యావసరాలు అందించి అండగా నిలిచింది.

east godavari district
స్వర్ణకారులకు నిత్యవసర వస్తువులు అందజేసిన బంగారం వ్యాపారులు

By

Published : May 1, 2020, 5:58 PM IST

Updated : May 1, 2020, 8:09 PM IST

ప్రస్తుతం సీజన్లో చేతినిండా పనితో గడపాల్సిన స్వర్ణకారులు లాక్​డౌన్​తో జీవనోపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆభరణాల విక్రయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే నరసాపురంలో దుకాణాలు మూతపడటంతో స్వర్ణకారులు పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్వర్ణకారులను ఆదుకునేందుకు నరసాపురం బంగారం వర్తక సంఘం ముందుకొచ్చింది. నిరుపేదలైన 200 స్వర్ణకార కుటుంబాలకు రూ.2 లక్షల 20 వేల రూపాయలతో నిత్యావసరాలు సమకూర్చి అందజేశారు. ఈ కార్యక్రమంలో బంగారు వర్తక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ జైన్, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రాజేంద్ర కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : May 1, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details