పశ్చిమగోదావరి జిల్లాలో పరిమితి సంఖ్యలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించారు. జిల్లాలో 8 డిపోల్లో 676 బస్సులు ఉండగా.. 130 బస్సు సర్వీసులు మాత్రం మొదటిరోజు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 180 గ్రౌండ్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టికెట్లు తీసుకొని బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలోనే కాకుండా విజయవాడ, రాజమహేంద్రవరం, రావులపాలెం, మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. బస్సుల్లోకి ఎక్కే ముందే చేతులు శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం, కొవ్వూరు డిపోల నుంచి అధిక సంఖ్యలో పల్లెవెలుగు బస్సు సర్వీసులు నడిపారు. ఆయా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువ కనిపించింది.
జిల్లాలో రోడ్డెక్కిన 130 ఆర్టీసీ బస్సులు
పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు సర్వీసులు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 130 బస్సులు నడిపారు. 180 బుకింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయినా ఆశించినంతగా ప్రయాణికులు బస్సుల్లో ఎక్కలేదు.
bus services