ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలిపించండి... రాగానే సీపీఎస్ రద్దు చేస్తా..!

పశ్చిమ గోదావరి జల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.... హామీల వర్షం కురిపించారు. సంపాదనతో సంబంధం లేకుండా ప్రతీ ఆడపడుచుకు ఏడాదికి 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు , మా ఇంటి మహాలక్ష్మి, చీర సారే వంటి పథకాలను ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్

By

Published : Apr 1, 2019, 8:27 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారానికిజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సంపాదనతో సంబంధం లేకుండా ప్రతీ ఆడపడుచుకు ఏడాదికి 10 ఉచిత గ్యాస్ సిలిండర్ల్ అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ విధానాన్ని తీసేసి 2వేల 5 వందల నుంచి 3 వేల రూపాయల వరకు మహిళల ఖాతాల్లో జమచేస్తానని తెలిపారు. 'మా ఇంటి మహా లక్ష్మీ' పథకం ద్వారా ఆడపడుచు పెళ్ళికి ఒక లక్ష రూపాయలు ఆర్థికసాయం అందజేస్తానని అన్నారు. చీర సారె ద్వారా పదివేల 116 రూపాయలు ఇవ్వడం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించడం లాంటి పథకాలు తెస్తామనిహామీ ఇచ్చారు.

సీపీఎస్ రద్దు.. బంగారు నగలపై పావలా వడ్డీ ఋణం

జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు నగలతో పావలా వడ్డీకే ఋణాలు ఇప్పిస్తామనికల్పిస్తానని పవన్ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రస్తుత పెన్షన్ విధానం సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. 60 సంవత్సరాలు నిండిన రైతులకు ప్రతీ నెల 5 వేల రూపాయలు అందజేస్తానని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details