ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశ ప్రగతి యువత చేతుల్లోనే ఉంది- ఎస్పీ రాజకుమారి - sp raja kumari on youth role

దేశ ప్రగతి యువత చేతుల్లో ఉందని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస గ్రామంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్​ను ఎస్పీ ప్రారంభించారు. సాలూరు మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

Breaking News

By

Published : Dec 3, 2020, 7:24 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఎస్పీ రాజకుమారి పర్యటించారు. దిగువ మండంగి, బాహజ్వాల గ్రామాలను సందర్శించి.. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు, చిన్నారులకు పండ్లు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గిరిజనులకు వైద్య సహాయాన్ని అందించేందుకు మెగా వైద్య శిబిరాన్ని దుగ్గేరులో ప్రారంభించారు. వైద్య బృందం సహకారంతో వైద్య సేవలందించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

దుప్పట్లు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి
మెగా వాలీబాల్ టోర్నమెంట్​లో ఎస్పీ
దుప్పట్లు అందిస్తున్న ఎస్పీ రాజకుమారి

మక్కువ మండలం ఎర్రసామంతవలస గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్​ను ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్​ నిర్వహిస్తున్నామన్నారు. దేశానికి సేవ చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతి యువత చేతుల్లోనే ఉందన్నారు.

ఇదీ చదవండి: రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details