ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 1:46 PM IST

ETV Bharat / state

'అచ్చెన్న డిశ్చార్జ్ విషయంలో అంత గందరగోళం ఎందుకు?'

తెదేపా నేత అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ వ్యవహారంలో నిన్న రాత్రి తలెత్తిన గందరగోళంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పాలన చేస్తోందని ఆరోపించారు.

tdp mlc
tdp mlc

మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడును నిన్న రాత్రి డిశ్చార్జ్ చేస్తామంటూ గుంటూరు ఆసుపత్రి ఉన్నతాధికారులు చెప్పడం.. ఆ తర్వాత నిర్ణయం ఉపసంహరించుకోవడం తెలిసిందే. గందరగోళానికి దారి తీసిన ఈ పరిస్థితిపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి హడావుడి నిర్ణయాలు ఎందుకని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.

విపక్షంలో ఉన్నప్పుడు.. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదన్న నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు అదే పోలీసులను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ విరుద్ధంగా పనులు చేయిస్తున్నారని ఆమె అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్టులేంటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో తమ పార్టీని భయపెట్టలేరని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details