విజయనగరం జిల్లా సాలూరు మండలం మరిపల్లి పంచాయతీ వెలగవలస నుంచి మునక్కాయ వలస వెళ్లేందుకు సువర్ణముఖి నది దాటాల్సి ఉంది. ప్రభుత్వం ఈ నదిపై రూ.8కోట్లతో ఓ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
ప్రస్తుతం ఆ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ఆ ప్రాంతాలలోని వారంతా... నేరుగా వెలగవలస వచ్చే వీలుంటుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.