విజయనగరం జిల్లా భోగవలస, మామిడిపల్లి క్వారంటైన్ కేంద్రాల్లో అత్యవసర సేవలందిస్తున్న ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లకు స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొర నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా రోడ్లపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు అందజేత
కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి పలువురు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి నిత్యావసరాల అందజేత