ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. 2018 సర్వేలో విజయనగరం అత్యంత వెనకబడిన జిల్లాగా తేలిందని గుర్తు చేశారు. విజయనగరంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికలో పాల్గొన్న జీవీఎల్.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
"ఎందరో సాహితీవేత్తలు, కళాకారులు పుట్టినగడ్డ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇక్కడి కళాకారులు, రచయితలు గళం ఎత్తాలి. ఉత్తరాంధ్ర వెనకబాటుపై ప్రతి ఒక్కరూ నేతలను నిలదీయాలి. కేవలం కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి. అన్నిరంగాల్లో వెనకబడిన ఉత్తరాంధ్ర.. భూ కబ్జాలో ముందుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కేంద్ర విధాన నిర్ణయం. ప్రైవేటీకరణతో స్టీల్‌ప్లాంట్ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది."- జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు