స్పీకర్ తమ్మినేని సీతారాంకి నారా లోకేశ్ బహిరంగ లేఖ రాయడంపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. లోకేశ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. విజయనగరంలో నారెడ్కో ప్రాపర్టీ షో-2019 ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వైకాపా శాసనసభ్యులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసినా.. అప్పటి స్పీకర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా.. విమర్శించడం సరికాదన్నారు. తెదేపా నాయకులు స్పీకర్ను విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ తలుచుకుంటే తెదేపా నాయకులంతా వైకాపాలోకి వస్తారని పేర్కొన్నారు.
'తెదేపాను తుడిచిపెట్టాలంటే.. జగన్కు నిమిషం చాలు'
శాసనసభ స్పీకర్ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించడంపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.
minister vellampally comments on lokesh
TAGGED:
minister vellampalli news