విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వాసవి ఆర్య వైశ్య ఇందుపూరు వెంకట్రావు కళ్యాణమండపంలో నిర్వహించిన గణిత అష్టావధానంలో 12 ఏళ్ల బాలుడు ప్రతిభతో ఆకట్టుకున్నాడు. పట్టణానికి చెందిన రాజ్ రిజ్వాన్... అష్టావధానం చేశాడు. కేలండర్ ఘన మూలం, మాయా చదరాలు, మనం సంకలనం, ఆ బేసి సంఖ్య చెప్పేస్తా, మీ జన్మదినం చెప్పేస్తా, మకతిక గుణకారం, అద్భుత జ్ఞాపకశక్తి అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సభాధ్యక్షులుగా పసుమర్తి వెంకట ప్రసాద్, సమన్వయకర్త బొమ్మరిల్లు నాగేశ్వరరావు, వేద గణిత పండితులు నేరెళ్ల నారాయణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. వివిధ అంశాల్లో ప్రతిభావంతులు అడిగిన ప్రశ్నలకు బాలుడు రిజ్వాన్ సమాధానం చెప్పి శభాష్ అనిపించుకున్నాడు.
శభాష్ రిజ్వాన్.. అద్భుతంగా గణిత అష్టావధానం - maths astavadhanam
విజయనగరం జిల్లా పార్వతీపురంలో 12 ఏళ్ల బాలుడు గణిత అష్టావధానంలో ప్రతిభను ప్రదర్శించాడు.

ఆకట్టుకున్న బాలుని గణిత అష్టావధానం