ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతుల భిక్షాటన - విజయనగరం జిల్లా కోమరాడలో రైతుల ధర్నా వార్తలు
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ.. పర్యవేక్షణ విధానం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల వద్ద కొనుగోళ్లు జరగడం లేదని రైతులు వాపోతున్నారు.