విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన సేకరణ కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. ధాన్యం ఇచ్చి నెలన్నర గడుస్తున్నా... ఇప్పటికీ తమ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని వాపోయారు. ప్రతి ఏటా సంక్రాంతి సమయానికి 85 శాతం డబ్బులు ఇచ్చేవారని... ఇప్పుడు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే తాము వ్యవసాయం మానేసి కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వేదన చెందారు. అయితే రైతులకు మరో రెండు రోజుల్లో తమ ఎకౌంట్లలో డబ్బులు జమ చేయిస్తామని ఏపీ సీడ్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
సాలూరు విత్తన కేంద్రం వద్ద రైతులు ఆందోళన - విజయనగరం జిల్లా తాజా వార్తలు
తమ డబ్బులు ఇంకా జమ కాలేదంటూ సాలూరు మండలం పరిధిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విత్తన సేకరణ కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. విత్తన కేంద్రానికి ధాన్యం ఇచ్చి 45 రోజులు గడుస్తున్నా... ఇంకా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాలూరు విత్తన సేకరణ కేంద్రం వద్ద రైతులు ఆందోళన
సాలూరు విత్తన సేకరణ కేంద్రం వద్ద రైతులు ఆందోళన
ఇదీ చదవండి: