విజయనగరం జిల్లా సాలూరు మండలం అన్న గిరిశిఖర గ్రామంలో కరోనా భయం.. ఓ గర్భిణీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. గ్రామానికి చెందిన కునేటి అనే మహిళకు పురిటినొప్పులతో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు ఆమె భర్త. అయితే కరోనా దృష్ట్యా గ్రామంలోనికి ఎవరినీ అనుమతించకుండా రహదారికి అడ్డంగా.. గ్రామస్థులు కర్రలు, దుంగలు వేశారు. దీని వల్ల గ్రామంలోకి వాహనం రావడానికి ఇబ్బంది తలెత్తింది. మహిళను ఆస్పత్రికి తరలించే లోపు మార్గమధ్యలోనే ప్రసవించింది.
కరోనా ఎఫెక్ట్ : గర్భిణి అవస్థలు... మార్గమధ్యలోనే ప్రసవం - pragency lady problems in vijayanagaram saluru district
కరోనా వైరస్ భయంతో గ్రామాల్లో స్వీయ నిర్భంధం ఓ గర్భిణీని ఇబ్బందులకు గురి చేసింది. గ్రామంలోకి రాకుండా అడ్డుగా కర్రలు వేయడం వల్ల వాహనం రావడానికి ఆలస్యమై.. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రసవమైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : గర్భిణి అవస్థలు... మార్గమధ్యలోనే ప్రసవం