ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో కలెక్టర్​ సమీక్ష

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని నిర్వహణ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో విజయనగరం కలెక్టర్​ హరి జవహర్​లాల్​ సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

collector review meeting with officials about 10th class exams conducting in vijayanagaram district
అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్​ హరిజవహర్​లాల్​

By

Published : Jun 18, 2020, 5:40 PM IST

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లుపై విజయనగంర కలెక్టర్​ శాఖల వారీగా సమీక్షించారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈ ఏడాది రాయనున్న 30,369 మంది విద్యార్ధులకు 221 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 2,600 గదులను సిద్ధం చేశామన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్​ హరి జవహర్​లాల్​తో జరిగిన సమీక్షలో డీఈవో నాగమణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్​ హరిజవహర్​లాల్​

ABOUT THE AUTHOR

...view details