ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 12, 2020, 4:22 PM IST

ETV Bharat / state

మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు

వేలాది విద్యార్థులు చదువుకునే కళాశాలను మాన్సాస్ ట్రస్ట్​ ప్రైవేటీకరణ చేయటం సరికాదని ఏబీవీపీ విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ చేయకుండా చూడాలంటూ మంత్రి బొత్స సత్యనారయణ ఇంటిని ముట్టడించారు. ప్రైవేటీకరణ జరగకుండా తనవంతు ప్రయత్నం చేస్తానని బొత్స విద్యార్థులకు హామీ ఇచ్చారు.

మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు
మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు

మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ విజయనగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. వేలాది విద్యార్థులు చదువుకునే కళాశాలను మాన్సాస్ ట్రస్ట్​ ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. మంత్రి బొత్స ఇంట్లో లేని కారణంగా.. ఆయన సతీమణి ఝాన్సీలక్ష్మి విద్యార్థులతో ఫోన్​లో మాట్లాడారు.

ఎంఆర్ కళాశాల వివాదం తనకు తెలుసునని.. తను కూడా ఆ కళాశాల పూర్వ విద్యార్థినేనని బొత్స విద్యార్థులతో అన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ విషయమై కలెక్టర్​కు సైతం వినతిపత్రం అందించాలని విద్యార్థులకు సూచించారు. బొత్స సతీమణి ఝాన్సీ మాట్లాడుతూ... విద్యార్థుల ఆందోళలనలను మాన్సాస్ ఛైర్​పర్సన్ సంచైత అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details