విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మరో చోటికి మార్చే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విభజన చట్టంలో భాగంగా నిపుణుల కమిటీ పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వర్శిటీని... ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాలని నెల్లూరులో ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ రాజశేఖర్ ప్రశ్నించారు. వర్శిటీని మార్చే ప్రక్రియను విరమించుకోకుంటే ఆందోళన చేపడతామన హెచ్చరించారు.
'గిరిజన వర్శిటీని మార్చే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలి' - nellore abvp latest news
కొత్తవలస దగ్గరున్న రెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని.. మరో చోటికి మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నెల్లూరు ఏబీవీబీ డిమాండ్ చేసింది. కొంతమంది ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు.

గిరిజన వర్శిటీ తరలించవద్దంటూ ఏబీవీబీ డిమాండ్