ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో టీడీపీలో భారీగా చేరికలు..

YSRCP Leaders Joining To TDP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల ప్రచార కళ కనపడుతోంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే అప్రమత్తమై 2024 ఎన్నికల్లో గెలుపొందడానికి కార్యక్రమాలు మొదలు పెట్టాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ ప్రజల్లోకి దూసుకెళుతోంది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ భారీగా వలసలు మొదలయ్యాయి.

200 కుటుంబాలు టీడీపీలోకి చేరారు
200 కుటుంబాలు టీడీపీలోకి చేరారు

By

Published : Feb 28, 2023, 11:42 AM IST

వైఎస్సార్సీపీకి దెబ్బ మీద దెబ్బ..గడిచిన మూడు రోజుల్లో టీడీపీ భారీగా వలసలు

YSRCP Leaders Joining To TDP : వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఆగడం లేదు. రోజు రోజుకి చేరికలు పెరిగిపోతున్నాయి. విజయనగరం జిల్లాలో మూడు రోజుల క్రితం టీడీపీలోకి చేరారు. తాజాగా అదే జిల్లాలో అదే టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలస పోయారు. పది కాదు ఇరవై కాదు వందల కుటుంబాలు టీడీపీలో చేరడంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు దెబ్బ మీద దెబ్బ పడినట్లుగా అయ్యింది.

టీడీపీలోకి చేరిన 200 కుటుంబాలు : విజయనగరం జిల్లా రేగిడి మండలం సోమరాజు పేట గ్రామంలో సోమవారం 200 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. మాజీ మంత్రి రాజాం టీడీపీ ఇన్​ఛార్జ్​ కొండ్రు మురళీ మోహన్ ఆధ్వర్యంలో సోమరాజు పేట గ్రామ మాజీ సర్పంచ్ బూడి ఆది నారాయణ ఆధ్వర్యంలో పలువురు వార్డ్ నెంబర్లుతో పాటు 200 కుటుంబాలు వైఎస్సార్సీపీ వీడి టీడీపీలో చేరారు. కొండ్రు మురళీ మోహన్ వీరికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోని ఆహ్వానించారు. తొలిత గ్రామంలోకి వచ్చిన కోండ్రు మురళీ మోహన్ కు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించారు.

నష్ట పోతున్న అన్ని వర్గాల వారు : కొండ్రు మురళీ మోహన్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. సకాలంలో జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు కూడ నోచుకోని పరిస్థితి ఉందని కొండ్రు మురళీ మోహన్ అన్నారు.

టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్న వైఎస్సార్సీపీ నేతలు : ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ, నిస్పృహలకు గురైన వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలే ఇందుకు నిదర్శనం అన్నారు.ఎన్నికల సమయానికి రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సైతం టీడీపీలోకి చేరే అవకాశం ఉందఅని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని కొండ్రు అన్నారు.

మూడు రోజుల క్రితం : రాజాం నియోజకవర్గం ఇన్​ఛార్జ్​ కోండ్రు మురళీ మోహన్ సమక్షంలో 200 కుటుంబాలు వైఎస్సార్​సీపీ నుంచి టీడీపీలో చేరారు. రాజాం పట్టణం తెలగావీధికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకులు నంది సూర్యప్రకాష్, బానిశెట్టి వెంకట్రావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వీరికి కొండ్రు మురళీమోహన్ టీడీపీ కండువా కప్పి పార్టీలోనికి స్వాగతం పలికారు.

అభివృద్ధి శూన్యం : వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సారాలు గడిచినా రాజాం పట్టణం కనీస అభివృద్ధి జరగలేదని, అధికార పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా టీడీపీలో చేరామని పార్టీలో చేరిన పలువురు యువకులు, మహిళలు అన్నారు. రాజాంలో పట్టణంలో టీడీపీ కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చి ఆ పార్టీలో చేరారు.

పేదవారికి అందని ధరలు :అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోండ్రు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరుకుల ధరల పెరిగాయన్నారు. రాష్ట్రంలో పూర్తిగా మహిళలకు రక్షణే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు, టీడీపీలో రోజు రోజుకూ యువతీ, యువకులు, మహిళలు చేరికలు శుభ పరిణామం అని అన్నారు.

టీడీపీకి పూర్వవైభవం : రాబోయే రోజుల్లో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. భవిష్యత్తులో టీడీప మళ్లీ అధికారంలోకి వస్తుందని కోండ్రు మురళీ మోహన్ అన్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details