విజయనగరం జిల్లా సాలూరులో ఆర్టీసీ బస్సు ఢీ కొని పంతపు అప్పలరాజు అనే వ్యకి మృతి చెందాడు. తన తమ్ముడి ఇంటికి వచ్చి సొంతూరికి తిరిగి సైకిల్‌పై వెళ్తుండగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అవుట్ గేట్ మలుపు వద్ద బస్సు వచ్చి ఢీ కొట్టింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి - సాలూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం
ప్రగతి చక్రం అతని పాలిట మృత్యు పాశమైంది. ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు కాంప్లెక్ ఆవరణలో జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు.
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
Last Updated : Oct 30, 2019, 12:22 PM IST