విశాఖ పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్‌కు కొవిడ్ సోకింది. రెండు రోజుల క్రితం ఏజెన్సీలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు లీలా ప్రసాద్ తెలిపారు. అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికి తనకు కొవిడ్ సోకిందని అన్నారు. అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలంతా.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
'వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా కొవిడ్ సోకింది' - పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారికి కరోనా
విశాఖ పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు ఆయన తెలిపారు.
డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్