ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా పాదయాత్ర

పోస్కో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జ్​, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. నాలుగు కిలోమీటర్ల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించి, మానవహారం చేపట్టారు.

tdp protest agianst visakha steel plant privatization
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా పాదయాత్ర

By

Published : Feb 18, 2021, 4:39 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని ఘాట్ రోడ్ కూడలి నుంచి మాడుగుల వరకు రామానాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నాలుగు కిలోమీటర్ల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ.. సీఎం డౌన్ డౌన్ అంటూ.. మాడుగుల బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు.

2019లో పోస్కోతో సీఎం ఒప్పందం...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు తెలుగుదేశం పోరాటం కొనసాగిస్తోందని రామానాయుడు తెలిపారు. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రతిపాదన తీసుకువస్తే అప్పటి ప్రధానమంత్రి వాజపేయి దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటీకరణ రద్దు చేయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 2019లో పోస్కో కంపెనీతో సీఎం చేసుకున్న ఒప్పందమే.. ఇప్పుడు బయటపడిందని, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి:

త్వరలోనే రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపు: సీపీఐ రామకృష్ణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details