శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం సంతోషకరమైన విషయమని తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రతి గ్రామంలోనూ రామాలయలూ వెలుస్తున్నాయి కానీ.. రాముడు జన్మించిన స్వస్థలంలో ఇప్పటివరకు రామాలయం లేకపోవటం బాధకరమైందన్నారు.
ఆ పనిని మోదీ ప్రభుత్వం చేయగలిగింది: అయ్యన్న
వాజ్పేయి, అద్వానీ వంటి వారు అయోధ్యలో చేయలేని రామ మందిర నిర్మాణాన్ని.. మోదీ ప్రభుత్వం చేయటం సంతోషించదగ్గ విషయమని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. రామ మందిర నిర్మాణంలో హిందువులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
అయ్యన్నపాత్రుడు
వాజ్పేయి, అద్వానీ వంటి నాయకులు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రయత్నాలు చేసినా.. సఫలం కాలేకపోయారనీ.. ఇన్నాళ్లకి మోదీ ప్రభుత్వం నిర్మాణం చేయటం సంతోషించదగ్గ అంశమని అన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో పవిత్రమైన కార్యక్రమమనీ.. ఇందులో హిందువులంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువు.. పది రూపాయల చొప్పున ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.