విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆనారోగ్యంతో అనాథగా పడి ఉన్న ఎం.శ్రీ నివాస్‌కు సపరచర్యలు చేపట్టేందుకు పట్టణంలోని యువకులు ముందుకు వచ్చారు. శ్రీనివాస్ దుస్థితిపై ఈటీవీ భారత్‌లో 'ఆదుకోండి సారూ..మూడు రోజులుగా అక్కడే' ఈనాడులో అడుగు పడక..అన్నం లేక అనే శీర్షికతో వార్తకథనాలొచ్చాయి. దీనిపై సామాజిక కార్యకర్త సకురు కోటేశ్వరరావు స్పందించి అతనిని అంబులెన్సులో చోడవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వినయ్ ప్రాధమిక వైద్య సేవలందించారు. అనకాపల్లి ఏన్టీఅర్ ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు కోటేశ్వరరావును విశాఖకు తరలించారు.
చోడవరంలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన
'ఆదుకోండి సారూ..మూడు రోజులుగా అక్కడే' ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. విశాఖ జిల్లా చోడవరం క్లాంప్లెక్స్ వద్ద అనారోగ్యంతో పడి ఉన్న ఎం.శ్రీనివాస్‌కు సహాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు.
చోడవరంలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన