విశాఖ మ్యూజియంలో ఔత్సాహిక చిత్రకారుడు గాజుల షణ్ముఖ సాయి చరణ్... నైరూప్య చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందిన సాయి చరణ్... ఒక విభిన్న చిత్రకారుడు. తన మనసులో మెదిలే ఆధ్యాత్మిక భావాల పరంపరను... నైరూప్య చిత్రాలుగా రూపొందించడం అతని ప్రత్యేకత. ప్రధానంగా రంగుల్లో ఎర్రటి వర్ణాన్ని అతను ఎక్కువగా ఇష్టపడతాడని... చిత్రకళ బోధించిన గురువులు చెప్తున్నారు.
'మాటలకందని భావాలు... మంచి మనసుని చెబుతాయి' - painting artist sai charan latest picture show news in visakhapatanm
అతని మునివేళ్లు తాకి... దృశ్యాలు నైరూప్య చిత్తరువులవుతాయి. ఒక భావం దృశ్యమానమై, వర్ణ వైచిత్రిని సాక్షాత్కరిస్తుంది. భావాంతరాలల్లో మెదలిన ఒక స్వరంలా... ఆ కుంచె వెంట రంగుల ప్రవాహాల్లా కంటికి చేరి... 'ప్రత్యక్ష-పరోక్ష'బొమ్మలా కొలువుదీరుతుంది.

'మాటలకందని భావాలు... మంచి మనసుని చెబుతాయి' అని ఒక కవి అన్నట్టు... రమణ మహర్షి ఎదుట పూసిన ఒక రోజా పువ్వుని నైరూప్య చిత్రంగా రూపొందించిన... అతని కళానైపుణ్యానికి ప్రతీక అని కళా విమర్శకులు చెబుతున్నారు. ఎక్కువగా మాటలు నేర్వని సాయి చరణ్... తన కుంచె ద్వారా భావోద్వేగాలను రంగుల స్వరాలుగా అల్లుతాడు. సముద్రంలోని ఓడలు, బాణం వేసే మనిషి వంటి సన్నివేశాలను అతను తనదైన శైలిలో కుంచెతో వ్యక్తీకరిస్తాడు. అతని మనసులో మెదలాడే భావాలనే... బొమ్మలుగా మలుస్తాడని చిత్రకారులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: 'అంతరించిపోతున్న కళలను వెలికితియ్యడమే మా లక్ష్యం'